రోస్టర్ విధానం సవరించాలి.. మాలలకు న్యాయం చేయాలి జాతీయ మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జి ఆరె కిశోర్
విశ్వంభర , అక్కన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అంగన్‌వాడీ నియామక నోటిఫికేషన్‌లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టుల రిజర్వేషన్ కేటాయింపులో ఎస్ఎస్సి జీ 3లోని మాల, అనుబంధ ఉపకులాలకు ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని జాతీయ మాల మహానాడు హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆరె కిశోర్ ఆరోపించారు. ఇతర వర్గాలకు, ముఖ్యంగా ఈడబ్యూఎస్ కేటగిరీకి పోస్టులు కేటాయించినప్పటికీ, రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లకు అర్హులైన ఎస్ఎస్సి జీ 3 లోని మాల, అనుబంధ ఉపకులాలను పూర్తిగా విస్మరించడం ఆందోళనకరమన్నారు. ఎస్సి 3లోని మాల, అనుబంధ ఉపకులాలకు ఒక్క పోస్టు కూడా ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు మాల, అనుబంధ ఉపకులాలకు వర్తించవా అని నిలదీశారు.ఎస్సి వర్గంలోని ఒక ఉపవర్గానికి పూర్తిగా అవకాశం లేకుండా చేయడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మాల, అనుబంధ ఉపకులాల యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు దూరమయ్యేలా రోస్టర్ విధానం అమలవుతోందని విమర్శించారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ప్రతి వర్గానికి సమానంగా అందేలా ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని తక్షణమే పునఃసమీక్షించి, ఎస్సి జీ 3లోని మాల, అనుబంధ ఉపకులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.