ఎమ్మెల్యే కుంభం సొంత నిధులతో భీమలింగం కాలువలో గుర్రపు డెక్క తొలగింపు
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని భీమలింగం కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకును ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంత నిధులతో తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వలిగొండ చెరువు నుంచి మల్లెపల్లి, వెలవర్తి, మొగిలిపాక మీదుగా ముద్దాపురం వరకు కాలువలో హిటాచీ యంత్రంతో ఆకు తొలగింపు చేపట్టారు. భీమలింగం కాలువలో గుర్రపు డెక్క ఆకు కారణంగా దిగువ ప్రాంత రైతులకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహదేవ్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాలువ శుభ్రపరిచిన అనంతరం దిగువ ప్రాంతాలకు సాగునీరు సాఫీగా చేరి బీడుగా ఉన్న భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహదేవ్, సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గరిసె రవి, వైస్ చైర్మన్ జంగారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.