కూచనపల్లి–మాలపల్లి వంతెనకు రూ.3 కోట్ల నిధులు

విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లి–మాలపల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుతూ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మడప పద్మ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, వంతెన లేక ప్రతి వర్షాకాలంలో ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి రూ.3 కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమై ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నె రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ బంక చందు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/3-crore-funds-for-kuchanapally-malapally-bridge/article-21193

Tags: