రాయపర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపి
- రికార్డులు, రిసెప్షన్, కేసుల నిర్వహణపై సమగ్ర పరిశీలన
విశ్వంభర, రాయపర్తి : మండల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ రాజమహేందర్ నాయక్ ఆకస్మికంగా సందర్శించి స్టేషన్‌లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నమోదు విధానం, రిసెప్షన్ నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలు, పెండింగ్ కేసుల వివరాలు, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఇతర అధికారిక పత్రాలను పరిశీలించిన డీసీపీ, రికార్డులను నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు దృవీకరిస్తూ నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పాటు, వారి ఫిర్యాదులను వెంటనే స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ కొమ్మూరి శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.