అంగన్‌వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి :సర్పంచ్ దేవేందర్

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం తండా, మైలార్‌బాయి తండాలో విద్యుత్ అంతరాయాలు నివారించేందుకు ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలోని చెట్ల కొమ్మలను గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో తొలగించారు. అనంతరం గంగారం తండా అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ, పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించాలని, తొలి ఆరు నెలలు తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారమని తెలిపారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ టీచర్ రూప, ఉపాధ్యాయుడు శ్రీధర్, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sarpanch-devender-should-take-advantage-of-the-services-of-anganwadi/article-21163

Tags: