మార్షల్ ఆర్ట్స్‌ను కమర్షియల్ చేయొద్దు: సేవ్ ది మార్షల్ ఆర్ట్స్

విశ్వంభర, హిమాయత్ నగర్: డబ్బులు తీసుకుని అవార్డులు ఇవ్వడం వల్ల మార్షల్ ఆర్ట్స్ ప్రతిష్ఠ దెబ్బతింటుందని,  నిజమైన ప్రతిభకు మాత్రమే గుర్తింపు దక్కాలని మాస్టర్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. హైదరాబాదు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం సేవ్ ది మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్షల్ ఆర్ట్స్ పేరుతో డబ్బులు తీసుకుని అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమాలను నిలిపివేయాలని సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నంది, బుద్ధ, అర్జున తదితర పేర్లతో అవార్డులు ప్రకటిస్తూ ఒక్కో అవార్డుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని, మాస్టర్లు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 9న పంజాగుట్ట చెస్ ఆడిటోరియంలో నిర్వహించనున్న అవార్డుల కార్యక్రమాన్ని నిలిపివేయాలని పంజాగుట్ట పోలీసులతో పాటు తెలంగాణ స్పోర్ట్స్ ఒలింపిక్ కమిటీ, సంబంధిత ప్రభుత్వ శాఖలకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అవార్డులు అందజేస్తున్న సంస్థలకు చట్టబద్ధమైన గుర్తింపు, రిజిస్ట్రేషన్, బైలాస్ ఉంటే వాటిని బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిజమైన ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, విశిష్ట సేవలందిస్తున్న మాస్టర్లకు మాత్రమే గుర్తింపు అవార్డులు ఇవ్వాలని, డబ్బులు తీసుకుని అవార్డులు ఇచ్చే సంస్కృతిని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు మల్లికార్జున్ గౌడ్, శ్రీధర్, నాగరాజు, సదాశివ, గోవిందరాజు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dont-commercialize-martial-arts-save-the-martial-arts/article-21215

Tags: