తెలంగాణ ఉద్యమకారులుగా వీడియో జర్నలిస్టులను గుర్తించాలి

  • కే. కేశవరావుకు తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్టు అసోసియేషన్ వినతి

విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే. కేశవరావును కలిసి వీడియో జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, తాము ముందుగా తెలంగాణ బిడ్డలమని, ఆ తర్వాతే వీడియో జర్నలిస్టులమని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ దాడులు, రాళ్లదాడులను ఎదుర్కొంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పల్లెల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు జరిగిన ఉద్యమాన్ని తమ కెమెరాల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. ఉద్యమ సమయంలో తమ కెమెరాలను పక్కనపెట్టి పలుచోట్ల ఉద్యమకారులతో కలిసి పోరాటాల్లో పాల్గొన్నామని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ వంతు పాత్ర పోషించామని చెప్పారు. ప్రస్తుతం ఉద్యమకారుల గుర్తింపునకు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారని, అయితే ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఈరోజు తమ వద్ద ఉన్న వీడియోలను ఆధారాలుగా చూపిస్తూ గుర్తింపు పొందుతున్నారని పేర్కొన్నారు. ఆ వీడియోలను చిత్రీకరించిన తమలాంటి వీడియో జర్నలిస్టులు మాత్రం ఎలాంటి గుర్తింపుకు నోచుకోకుండా వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద కేసులు, పత్రికా క్లిప్పింగ్స్ లేదా వ్యక్తిగత ఆధారాలు లేకపోయినా, ఉద్యమానికి ఊపిరి పోసి ప్రజలకు ప్రతి ఘట్టాన్ని చేరవేసిన వీడియో జర్నలిస్టుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని, ఉద్యమకారుల జాబితాలో తమ పేర్లను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు నండూరి హరీష్, ప్రధాన కార్యదర్శి సన్నీ, ఖజాంచి విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్‌లు వీడియో జర్నలిస్టుల సమస్యలు, అభ్యంతరాలను కే. కేశవరావుకు సమగ్రంగా వివరించారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్టు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, సీనియర్ వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/video-journalists-should-be-identified-as-telangana-activists/article-19698

Tags: