నీలంపల్లిలో కరెంటు కష్టాలు.. వారం రోజులుగా విద్యుత్ లేక అవస్థలు

  • వారం రోజులుగా చీకట్లోనే నీలంపల్లి.. కరెంటు సమస్య పరిష్కరించాలని కాలనీవాసుల వేడుకోలు

Neelampalli Power Problem: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా కాలనీలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రాత్రివేళల్లో చీకటిమయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

సమస్యపై సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. వారం రోజులుగా విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న తమ పరిస్థితిని అధికారులు వెంటనే గుర్తించి నీలంపల్లిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

Read More అండర్ డ్రైనేజ్ సిసి రోడ్ల పనులు ప్రారంభించిన సర్పంచ్  

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/electricity-problems-in-neelampalli-for-a-week-or-so/article-21242

Tags: