సూర్యాపేటకు రైలు వచ్చే వరకు పోరాటం ఆగదు
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేటకు రైల్వే లైన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థుల భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఎల్‌ఐసీ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్త బస్టాండ్, ఎంజీ రోడ్డు మీదుగా వాణిజ్య భవన్ చౌరస్తాకు చేరుకుని బహిరంగ సభగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థులు రైల్వే లైన్ సాధించాలని కోరుతూ నినాదాలు చేశారు. రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్ధన్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ, సూర్యాపేటకు రైల్వే లైన్ రావడం ఈ ప్రాంత ప్రజల న్యాయమైన హక్కని పేర్కొన్నారు. గతంలో ప్రతిపాదించిన రైల్వే మార్గాన్ని మార్చడం అన్యాయమని విమర్శిస్తూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైల్వే లైన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటకు రైల్వే వచ్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ర్యాలీ విజయవంతానికి సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ రైల్వే సాధన సమితి కృతజ్ఞతలు తెలిపింది.