పీఆర్టీయూటీఎస్ మహాధర్నాను విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

విశ్వంభర, పెద్దశంకరంపేట: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి విచ్చేసిన ఆయనకు మెదక్ జిల్లా పీఆర్టీయూటీఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించి, పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని, సీపీఎస్ స్థానంలో ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈహెచ్‌ఎస్‌ను రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల పీఆర్టీయూటీఎస్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mlc-sripal-reddy-should-make-pruts-mahadharna-a-success/article-21145

Tags: