ఫార్మర్ రిజిస్ట్రీ చేసిన రైతులకే ఎరువుల విక్రయం
విశ్వంభర, పెద్దశంకరంపేట: కొత్తగా ప్రవేశపెట్టిన 'ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్' యాప్‌లో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ తదితర ఎరువులు విక్రయిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి నాదం కృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, మండలంలో మొత్తం 16,851 మంది రైతులు ఉండగా, వారిలో 12,100 మంది (71 శాతం) ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేశారని, మిగిలిన 29 శాతం మంది రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రిజిస్ట్రీ చేయని రైతులకు వ్యవసాయ శాఖ పథకాల ప్రయోజనాలు అందకపోవచ్చని హెచ్చరించారు. మిగిలిన రైతుల వివరాలను గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు అందజేశామని, రైతులు సందేహాలుంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.