చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్
విశ్వంభర,పెద్ద శంకరంపేట: ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని పెద్ద శంకరంపేటలో చేనేత కార్మికులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కండేయ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తిమీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న చేనేత కార్మికులందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందజేయాలని అన్నారు. రాష్ట్రంలో నేతన్న ల ఆకలి చావులు లేకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు పద్మశాలి కార్పొరేషన్ ద్వారా చేనేత వృత్తుల వారితోపాటు పద్మశాలీలలో ఇతర వృత్తులు చేసుకుంటున్నవారికి సైతం ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 25వేల రూపాయలు దాదాపు 71 వేల 1903 మందికి అందించారని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.. చేనేత కార్మికులు పద్మశాలీ లు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు. పెద్ద శంకరంపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జరి కనకరాజు. చేనేత సహకార సంఘం అధ్యక్షులు మహంకాళి కృష్ణమూర్తి. పట్టణ అధ్యక్షులు జంగం రాములు గుజ్జరి సంగమేశ్వర్. అనిల్ డాక్టర్. ఉపేందర్ జంగం రాఘవులు. సిహెచ్ నవీన్ . సంతోష్ కుమార్ .. దస్వంత్ నీలకంటి విట్టల్. కోట రమేష్. పడాల రవి. ఆయా గ్రామాల నుండి చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.