పీఆర్టీయూ టీఎస్ కేసముద్రం మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ మండల సర్వసభ్య సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా గోపాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా బీరం జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చాగర్లమూడి శ్రీధర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ టీఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నూతన అధ్యక్షుడు గోపాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బీరం జనార్దన్ రెడ్డి తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులు, ప్రధానోపాధ్యాయులు, మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.