విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం ముఖ్యం: ప్రిన్సిపాల్ హేమమాలిని
విశ్వంభర, బర్కత్‌పుర : బర్కత్‌పురలోని ఎ. శ్యామలాదేవి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్‌లో ఫ్రెషర్స్ పార్టీ శుక్రవారం నిర్వహించారు. విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఐవీఎస్ హేమామాలిని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థినులు తమ అనుభవాలను పంచుకుని విద్యార్థి దశలో సమయపాలన, కృషి, ఆత్మవిశ్వాసం విజయానికి పునాదులని వివరించారు. అనంతరం నిర్వహించిన మిస్ ఫ్రెషర్, మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.