రాజకీయ కక్షతోనే తప్పుడు ప్రచారం: గడ్డం శ్రీనివాస్ యాదవ్

విశ్వంభర, హిమాయత్ నగర్ : హైందవి విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్షతోనే అసత్య ప్రచారం చేస్తున్నారని హైందవి విద్యాసంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ సేఫ్టీ అనుమతులు పొందినట్లు ఆధారాలతో నిరూపిస్తే తాను నేరుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ ఏడాది ఫైర్ సేఫ్టీ అనుమతుల కోసం తమ కళాశాల ఎలాంటి దరఖాస్తు చేయలేదని, గత ఏడాది మాత్రమే జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. హైందవి జూనియర్ కళాశాల ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఫోర్జరీ జరిగి ఉంటే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ విద్యాసంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కళాశాల డైరెక్టర్లు రాము, రఫత్ తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gaddam-srinivas-yadav-has-been-falsely-campaigned-by-the-political/article-21187

Tags: