పొలం బాట పట్టిన నవభారత్ విద్యార్థులు
- వ్యవసాయంపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన
విశ్వంభర , హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం పాఠశాల కరస్పాండెంట్ గంగరవేణి రవీందర్ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పోతారం (ఎస్) గ్రామంలోని వరి పొలాలను సందర్శించారు. పొలంలో నారు ఎలా తీయాలి, నారు ఎలా పంచాలి, నాటు ఎలా వేయాలి, వరి పొలాన్ని ఎలా దున్నాలి, నీటి నిర్వహణ ఎలా ఉండాలి, పంట కోతకు ఎంత సమయం పడుతుంది వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. కొందరు విద్యార్థులు స్వయంగా నారు తీయడం, నారు పంచడం, నాటు వేయడంలో పాల్గొని రైతుల కష్టాన్ని అనుభవించారు. వ్యవసాయదారులు ఎండనక, వాననక, చలినక నిరంతరం శ్రమించి ప్రజలకు ధాన్యాన్ని అందిస్తున్నారని ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అన్నదాతలకు జేజేలు పలుకుతూ "జై జవాన్ – జై కిసాన్" అంటూ నినాదాలు చేశారు. క్షేత్ర పర్యటన ద్వారా వ్యవసాయం పట్ల అవగాహనతో పాటు రైతుల శ్రమ విలువను విద్యార్థులు తెలుసుకున్నారని కరస్పాండెంట్ గంగరవేణి రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.