పాఠశాల వంట ఏజెన్సీకి గ్యాస్ స్టవ్ అందజేత

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ వంట ఏజెన్సీకి ప్రభుత్వం మంజూరు చేసిన గ్యాస్ స్టవ్ తో పాటు రెండు సిలిండర్ లను స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్ ప్రధానోపాధ్యాయులు అమ్మ యాకయ్య తో కలిసి శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ కట్టెల పొయ్యి పొగ తో వంట ఏజెన్సీ వారు ఇబ్బంది పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంట ఏజెన్సీలకు గ్యాస్ స్టవ్ లను, సిలిండర్లను అందచేస్తోందన్నారు.వీటిని సద్వినియోగం చేయాలని ఏజెన్సీ వారికి సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన వేడి వేడి ఆహారాన్ని విద్యార్థులకు అందజేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను అలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది అన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు,ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజన పథకం వంటివి ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రవీణ్,నారాయణ,కె.యాకయ్య,సంపత్ ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/donation-of-gas-stove-to-school-cooking-agency/article-21161

Tags: