ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి: ఎంపీ వద్దిరాజు డిమాండ్

విశ్వంభర, మహబూబాబాద్ : విద్యార్థులకు బకాయిపడిన 11వేల కోట్ల రూపాయల ఫీజులను వెంటనే చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు,యువత ఆగ్రహావేశాలకు గురి కాకముందే వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన 11వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్,స్కాలర్ షిప్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం శనివారం కొత్తగూడెం కమ్మ సంఘం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది.బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు,ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి,యువజన వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.నీట్ ప్రశ్నాపత్రం లీక్ ను నిరసిస్తూ విద్యార్థులు,యువత దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనకు దిగడంతో బెంబేలెత్తిన ప్రధాని నరేంద్రమోడీ మధ్య రాత్రి కూడా స్పందించారని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, విద్యార్థులు, నిరుద్యోగ యువత,ఉద్యోగులు, కార్మికులు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించని కారణంగా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ బకాయిలు కూడా పెరిగిపోతున్నాయని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ యువత పోరుబాట పట్టారన్నారు.గోదావరి నీళ్లను సద్వినియోగంలోకి తేకుండా వృధాగా సముద్రం పాలవుతుంటే రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.రేవంత్ రెడ్డి ఎన్నికలకు 432 హామీలిచ్చి,6 గ్యారంటీలు ప్రకటించి భద్రాచలం రాముల వారితో సహా కనబడ్డ ప్రతి దేవుని మీద ఒట్లేసి, అబద్ధాలు చెప్పి, మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఎంపీ వద్దిరాజు విమర్శించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 56వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను 3కోట్ల దాక తీసుకుపోయి అన్ని విధాలా అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్ పాలకులు ఆగం పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఫీజుల బకాయిలను విడతల వారీగా చెల్లించాలని,లేనట్టయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చెల్లిస్తుందని ఎంపీ వద్దిరాజు హామీనిచ్చారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ,మాజీ వైస్ ఛైర్మన్ వేల్పుల దామోదర్, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, నాయకులు దళ్ సింగ్ నాయక్,లక్కినేని సురేందర్,రంగనాథ్,తొగరు రాజశేఖర్, మల్హోత్రా సాగర్,లావుడ్య సత్యనారాయణ,రాజు గౌడ్,అనుదీప్,నవతన్,వగ్గెల పూజ,జగడం కిరణ్, రమాకాంత్,కన్నిలతో పాటు పలు విద్యార్థి, యువజన,ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read More సెప్టెంబర్ 1న 'ఛలో ఢిల్లీ' పోస్టర్ ఆవిష్కరణ

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/fee-reimbursement-arrears-should-be-paid-immediately-demanded-mp-vaviraju/article-19761

Tags: