శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల వేడుకలు

 విశ్వంభర , హుస్నాబాద్ :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. చిన్నారులు వివిధ  వేషధారణలతో చూడముచ్చట గొలుపే విధంగా బోనాలు ఎత్తుకొని శోభాయాత్ర చేసి అనంతరం అమ్మవారి ఎదురుగా బోనాలు సమర్పించి ఆటపాటలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమము పాఠశాల ప్రబంధకారని కార్యదర్శి బబ్బుల రవీందర్ జ్యోతి ప్రజ్వలన చేయగా, పాఠశాల ప్రబంధ కారణిలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నారుల చూడ ముచ్చట గొలుపే వేషధారణలు చూడడానికి బోనాల ఉత్సవం చూడడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కాలనీవాసులు ఆసక్తిగా తిలకించారు. బోనము అంటే మనం వండుకునే భోజనం అని అది అమ్మవారికి సమర్పించడం ఎంతో శ్రేష్టమని కరువు కాటకాలు రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈ బోనాల జాతర నిర్వహిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాలారం శ్రీలత తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో ఈ బోనాల ఉత్సవంలో భాగంగా మాడిశెట్టి హేమలత ఆధ్వర్యంలో లలితా సహస్రనామం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రబంధ కారనీలు, మాతాజీలు,విద్యార్థినీ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bonala-celebrations-at-sri-saraswati-shishu-mandir-school/article-21225

Tags: