డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

బాలాపూర్‌లో ఇద్దరు చిన్నారులను తీసుకెళ్లే ప్రయత్నం.. అప్రమత్తమైన స్థానికులు

Balapur Polic: హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడీ సలేహీన్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులను డబ్బు ఆశ చూపి తమ వెంట తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అయితే చిన్నారులు వారితో వెళ్లేందుకు నిరాకరించగా, వారిని బెదిరిస్తూ దుర్భాషలాడినట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా రక్షించారు.

అనంతరం అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకుని బాలాపూర్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు, అనుమానితుల ఉద్దేశాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

Read More కోటి మందిని కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

🕒 25 Jul 2026 ✍️ Desk

డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

Balapur Polic: హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడీ సలేహీన్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులను డబ్బు ఆశ చూపి తమ వెంట తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అయితే చిన్నారులు వారితో వెళ్లేందుకు నిరాకరించగా, వారిని బెదిరిస్తూ దుర్భాషలాడినట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా రక్షించారు.

అనంతరం అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకుని బాలాపూర్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు, అనుమానితుల ఉద్దేశాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/two-suspects-are-in-police-custody-for-trying-to-take/article-19685

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?