తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం

తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం

  • మున్సిపల్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్ 

విశ్వంభర, హుస్నాబాద్:  హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని 17వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో జాతీయ తల్లిపాల వారోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ గాదెపాక రవీందర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, అంగన్‌వాడీ సూపర్వైజర్ కె. కవిత పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించడంతో పాటు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పోషకాహార కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా, దృఢంగా ఎదుగుతారని చెప్పారు. శిశువుకు తల్లిపాలు తొలి ఆహారం మాత్రమే కాకుండా తొలి రక్షణ కవచమని, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం ద్వారా అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వివరించారు. తల్లిపాలను ప్రోత్సహించడం ప్రతి కుటుంబం బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంగన్‌వాడీ సూపర్వైజర్ కె. కవిత మాట్లాడుతూ పుట్టిన శిశువుకు మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలే ఉత్తమమైన, సంపూర్ణ ఆహారమని తెలిపారు. తల్లిపాలలోని పోషకాలు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని వివరించారు. బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, పోషకాహార పదార్థాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. శిశువుకు సరైన సమయంలో, సరైన విధానంలో తల్లిపాలు అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు పడతాయని, చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, బాలింతలు, గర్భిణులు, తల్లులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/breastfeeding-is-the-babys-first-line-of-defense/article-21185

Tags: