సీరోలు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ డా. శబరీష్ శుక్రవారం సీరోలు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణ, డయల్-112 ఫిర్యాదులపై స్పందన, గ్రామాల సందర్శన వివరాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలు, వి.పి.ఓ. వ్యవస్థ పనితీరు, రాత్రి పహారా, సిబ్బంది వివరాలు, రౌడీ షీటర్లు, అనుమానితుల పర్యవేక్షణ, నేరాల పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు దృవీకరిస్తూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డయల్-112 ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని తెలిపారు. గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాచార సేకరణను ముమ్మరం చేసి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో వి.పి.ఓ. వ్యవస్థను సమర్థంగా వినియోగించి నేరాల నియంత్రణ, సైబర్ అవగాహన, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. రాత్రి పహారాలను పటిష్ఠంగా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజల పట్ల మర్యాదపూర్వక వైఖరితో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ కృష్ణ కిషోర్, మరిపెడ సీఐ పవన్, సీరోలు ఎస్‌ఐ సంతోష్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.