జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను ప్రామాణికంగా రూపొందించాలి: జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి
విశ్వంభర, సూర్యాపేట: జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ)ను అత్యంత ప్రామాణికంగా, నాణ్యతా ప్రమాణాలతో రూపొందించాలని జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, సూర్యాపేట నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. తెలంగాణలో తొలిసారిగా ప్రతి జిల్లాకు ప్రత్యేక జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపొందిస్తున్నామని, ఇందులో జనాభా, సామాజిక, ఆర్థిక, పరిపాలనా, మౌలిక వసతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తామని ఆమె తెలిపారు. ఈ హ్యాండ్‌బుక్ భవిష్యత్ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు, పరిశోధనలకు ప్రధాన ఆధారంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 10 నుంచి 21 వరకు అన్ని శాఖల నుంచి అధికారిక సమాచారాన్ని సేకరించి, నిర్ణీత నమూనాలో నమోదు చేయాలని, సెప్టెంబర్ 8లోపు జిల్లా సమగ్ర పరిచయాన్ని సిద్ధం చేసి, అనంతరం సమాచారం ధృవీకరించి రాష్ట్ర జనగణన కార్యాలయానికి పంపాలని సూచించారు. ప్రతి సమాచారం ఖచ్చితంగా, సంపూర్ణంగా, ఏకరూపంగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించి, గడువులోపు జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను పూర్తి చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, సీపీఓ కిషన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.