పద్మశాలీలు ఐక్యంగా ఉండాలి: భీమనపల్లి శ్రీనివాస్

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, చేనేత మగ్గానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు భీమనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పద్మశాలీలు అందరూ ఐక్యంగా ఉంటూ చేనేత వృత్తి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలు ధరించి చేనేతకు ప్రోత్సాహం అందించాలని, గ్రామంలో సమస్యలను ఐకమత్యంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, పద్మశాలి సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, నాగారం పద్మశాలి సంఘం ప్రతినిధులు, సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/padmashalis-should-be-united-bhimanapalli-srinivas/article-21153

Tags: