విద్యార్థుల అభ్యున్నతికి నిస్వార్ధంగా కృషి చేసేది ఉపాధ్యాయులు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విద్యార్థుల అభ్యున్నతికి నిస్వార్ధంగా కృషి చేసేది ఉపాధ్యాయులు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి :- మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప కాలనీకి చెందిన జాక వెంకటేష్  జిహెచ్ఎం ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందడంతో ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అతనిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాభ్యాసం చేసి వారి అభ్యున్నతికి నిస్వార్ధంగా కృషి చేసేది ఉపాధ్యాయులు అని అన్నారు. అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి గొప్పది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, వైస్ చైర్మన్ అయుబ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, కాంగ్రెస్ నాయకులు వెంకటరామిరెడ్డి, శశిధర్ రెడ్డి, కాలనీవాసులు రామ్ రెడ్డి, చంద్రమోహన్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Tags: