అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు  సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు  సీజ్

విశ్వాంభర, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట మండల పరిధిలోని వీరోజిపల్లి  వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను, జె సి బి లను  సీజ్ చేసినట్లు పేట తాసిల్దార్ ప్రభుదాస్ తెలిపారు. సోమవారం విరోచపల్లి వాగు వద్దకు పేట తాసిల్దార్ ప్రభుదాస్ సిబ్బందితో పాటు వెళ్లగా అక్కడ చెరువుల నుండి అక్రమంగా జెసిబి సహాయంతో ఇసుకను ట్రాక్టర్లలో  తరలిస్తుండడంతో రెండు ఇసుక ట్రాక్టర్లు , జెసిబి ని సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. అక్రమంగా  ఇసుకను తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ రమేష్, జి పి ఓ రాధా కిషన్ తదితరులు ఉన్నారు.

Tags: