బాధిత పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం
On
- ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆఫీసులో 2012 బ్యాచ్ కానిస్టేబుల్స్ ఏర్పాటు చేసి న "చేయూత పోలీస్ అసోసియేషన్ 2012బ్యాచ్ "ద్వారా ఇటీవల అకాల మరణం చెందిన కానిస్టేబుల్ రాంబాబు కుటుంబానికి, కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున 3లక్షల రూపాయలు ఎస్పి నరసింహ చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పోలీసుసంఘం అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ చంద్రా గౌడ్ , ఎస్ బి ఇన్స్పెక్టర్ రామారావు, 20212 బ్యాచ్ పోలీస్ లు సతీశ్, అశోక్, ప్రవీణ్, అబిద్, అంజి, వెంకట్, నాగయ్య, అందె శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.



