మే 1నుండి పాలిటెక్నిక్ ఉచిత శిక్షణ తరగతులు
On
- : ప్రిన్సిపల్ నాగరాజ్
విశ్వంభర, మహేశ్వరం : పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ మే 13న ఉండడంతో మహేశ్వరం మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలో మే 1 నుండి 11వ తేదీ వరకు ఎగ్జామ్స్ కు సంబంధించిన ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిక్షణ తరగతులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయని, అలాగే పాలీసెట్ 2026 హాల్ టికెట్ పొందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాలిటెక్నిక్ అడ్మిషన్ల గురించి హెచ్ సి ఎల్ హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఈ సంవత్సరం నుండి ఇక్కడ నిర్వహించబడుతుందని, వివరాలకు ఈ ఫోన్ నంబర్లను 8465039668, 9490120175, సంప్రదించవచ్చని చెప్పారు.



