అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం
On
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: అంగరంగ వైభవంగా గోదా సమేత శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం నిర్వహించారు. పెద్ద శంకరంపేట లోని గోదా సమేత వెంకటేశ్వర వార్షికోత్సవంలో భాగంగా శనివారం గోదా సమేత వెంకటేశ్వర స్వామికి వేద బ్రాహ్మణోత్తములు వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు బేక్రామ్ శ్రీనివాస్ గౌడ్ దంపతులచే స్వామివారికి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ , స్థానిక సర్పంచ్ జంగం రేణుక, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మధు, రాజేందర్ గౌడ్ ,చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్ కృష్ణమూర్తి, సురేష్ గౌడ్, గంగాధర్ గౌడ్, బక్క రెడ్డి తదితరులు పాల్గొన్నారు



