అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం
On
విశ్వంభర, నెల్లికుదురు: గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమైనదని ఎంపీడీవో సింగారపు కుమార్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులకు రెండవ దఫా శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఎంపీడీవో హాజరై మాట్లాడుతూ , తమ తమ వార్డులలోని సమస్యలను ఎప్పటికప్పుడు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేసేవారు వార్డు సభ్యులేనని గుర్తు చేశారు. బేషజాలకు, ప్రతిష్టకు ప్రతీకారాలకు పోకుండా సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రెండు రోజులుగా కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలలో శిక్షకులు గ్రామపంచాయతీ వార్డు సభ్యుల అధికారాలు, విధులు, సమస్యల పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పద్మ, డిప్యూటీ తహసిల్దార్ శ్రీనాథ్, వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.



