రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలకు కల్వల మోడల్ స్కూల్ విద్యార్థులు 

రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలకు కల్వల మోడల్ స్కూల్ విద్యార్థులు 

విశ్వంభర, కేసముద్రం: ఈనెల 28, 29, 30 వరకు నిజామాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి బేస్బాల్ సబ్ జూనియర్ పోటీలకు కేసముద్రం మండలం, టీజీ ఎంఎస్ కల్వల మోడల్ స్కూల్ విద్యార్థులు అంజి, యశ్వంత్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ పరిమి నవీన్, ఫిజికల్ డైరెక్టర్ లలిత బేస్బాద్, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కల్లూరు ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24వ తేదీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మహబూబాబాద్ లో జరిగిన జిల్లా స్థాయి పోటీలో అత్యంత ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గర్వకారణం. ఉపాధ్యాయులు పార్థసారథి, దుర్గాప్రసాద్, యాకయ్య, హెల్త్ కేర్ ప్రవళిక, నరసయ్య, శ్రీదేవి, సోమయ్య పోటీలకు ఎంపికైన విద్యార్థులను   అభినందించారు

Tags: