జిల్లా స్థాయికి ఎంపికైన సన్ షైన్ విద్యార్థులు

జిల్లా స్థాయికి ఎంపికైన సన్ షైన్ విద్యార్థులు

విశ్వంభర, చండూర్ ;- జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో  మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్ నందు సన్ షైన్ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి మండల మొదటి ర్యాంకుతో పాటు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుధాకర్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ మల్లేశం, టి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి సన్ షైన్ విద్యార్థులైన అక్షిత, జుబియా మెహరీన్, సిరి లకు మెమొంటోలు మరియు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న  మాట్లాడుతూ మండల స్థాయి ర్యాంకుతో పాటు జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల పేరును జిల్లా స్థాయిలో కూడా ర్యాంకు సాధించి అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాలని అన్నారు. చెకుముకి పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో మూఢనమ్మకాలను పారద్రోలి సైన్స్ పట్ల అవగాహనను పెంపొందించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రభాకర్ , వివిధ పాఠశాలల అధ్యాపకుల, మండల స్థాయిలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: