టైక్వాండోలో ప్రతిభ చాటిన సన్ షైన్ విద్యార్థి

టైక్వాండోలో ప్రతిభ చాటిన సన్ షైన్ విద్యార్థి

విశ్వంభర, చండూర్ :- టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ టెస్ట్ నేషనల్ సెమినార్ లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెమినార్ బెస్ట్ పార్టిసిపెంట్ అవార్డు పొందిన వెంకట సాయిని సన్ షైన్ పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న అభినందిస్తూ మెమొంటోని బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ ఇండియన్ ఒలంపిక్ టైక్వాండో కమిటీ అడ్వైజర్ అయిన లి యాంగ్ యుంగ్ సమక్షంలో ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని టైక్వాండో ద్వారా దేహదారుడ్యం  మరియు మానసిక సంసిద్ధతను పెంపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ, రవికాంత్, వినయ్, లతీఫ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: