స్టడీ మెటీరియల్ అందజేత
విశ్వంభర, రామన్నపేట: విశ్రాంత ఉపాధ్యాయులు దివంగత అనుముల అంతయ్య స్మారకార్థం వారి కుమారుడు అనుముల శ్రీనివాస్ విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురుకులం ఉచిత స్టడీ మెటీరియల్ ను ఫౌండేషన్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ నకరేకంటి సతీష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, గత సంవత్సరం కూడా వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఉచిత స్టడీ మెటీరీయల్ వినియోగించుకొని పదమూడు మంది విద్యార్ధులు గురుకుల పాఠశాలల్లో సీట్లు పొందారని, అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ సీట్లు పొందాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ గల పేద విద్యార్థులు ఈ మెటీరియల్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలలో విద్యార్ధుల అభ్యున్నతికి కృషి చేస్తున్న విపంచి ఫౌండేషన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సోమిరెడ్డి, వెంకటేశం, సువర్ణ, మాధవి, విద్యా కమిటీ చైర్మన్ సులోచన, మాజీ ఏంపిటిసి ఎర్రోల్ల సుక్కమ్మ, తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ ఎన్.అశోక్ కుమార్, ఎర్రోళ్ల మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



