జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వండి
- కలెక్టర్, డీఈవోలకు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ విజ్ఞప్తి
విశ్వంభర, జిహెచ్ ఎం సి : హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరంలో ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హైదరాబాద్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కమిటీ ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో బాగంగా వారి పిల్లల చదువులకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాదాపు 80 శాతం మంది జర్నలిస్టులు వేతనాలు సరిగా లేక నెలవారీ ఆదాయం లేక వారి పిల్లలను చదివించుకోలేక, కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారని,ఈ పరిస్థితిలో జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని వారు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాయితీలు అమలు చేయాలని కోరారు. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం ఆరంభం అయ్యేనాటికి జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ ను కలిసి వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో-కన్వీనర్లు ఆర్. శ్రీనివాస్ గౌడ్, ఎం. రవికుమార్, పి. సంతోష్ కుమార్, అడ్వయిజర్ గోవింద్ నాయక్, టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య తదితరులున్నారు. అనంతరం వారు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి(డీఈఓ) యాదయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు.