కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

 కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

  • నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ తప్పుకొంటున్నట్లు ప్రకటన
  • గత కొన్నిరోజుల పరిణామాలు బాధించాయని వ్యాఖ్య
  • వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడం లేదని వెల్లడి
  • యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు లేఖలో పేర్కొన్న వైనం
  • మోదీకి రాజీనామా పత్రాన్ని పంపిన ప్రధాన్‌

విశ్వంభర న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై కొనసాగుతున్న వివాదాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు వెల్లడించారు.
 
గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం పదవిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని, దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేసినట్లు వెల్లడించారు.