ఇంటర్మీడియట్ ఫలితాల్లో రేజోనన్స్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో రేజోనన్స్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

విశ్వంభర హనుమకొండ జిల్లా+- హనుమకొండ జిల్లా లోని  రేజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రెజ్యూనన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని రేజూనన్స్ కళాశాల చైర్మన్ లెక్కల రాజి రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కు చెందిన పొన్నాల వరుణ్ 470 మార్కులకు గాను 468 మార్కులు, కంపెల్లి తనుశ్రీ 468 మార్కులు ,ధోనికేనా సహస్ర 468 మార్కులు, సాధించి స్టేట్ సెకండ్ ర్యాంకులు సొంతం చేసుకున్నారని రాజిరెడ్డి తెలిపారు. బైపీసీ  విభాగంలో గుమ్మడవెల్లి మహతి 438 మార్కులు, వైష్ణవి 437 మార్కులు, సఫియా కౌసర్ 437 మార్కులు, ధరావత్ లక్ష్మీప్రసన్న 437 మార్కులు ,సాధించారు. ఎంపీసీ రెండవ సంవత్సరం విభాగంలో సాయి కీర్తన 995మార్కులు, హర్షల్ 994 మార్కులు, దండేవర్ష994 మార్కులు ,సాధించాలని బైపిసి విభాగంలో గండ్ర శ్రీజ991 మార్కులు, తభూసం 989 మార్కులు సాధించారని తెలిపారు .రేజోనన్స్ విద్యాసంస్థలు జేఈఈ, నీట్ లాంటి జాతీయస్థాయి పోటీపరీక్షల్లో అత్యంత విలువైన ర్యాంకులతోపాటు రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమదే పైచేయని నిరూపించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే జాతీయస్థాయి పోటీపరీక్షలైన జేఈఈ, అడ్వాన్సుడ్ ,నీట్ పోటీ పరీక్షలకు టాప్ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలొ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి ,డైరెక్టర్లు మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి, cao లెక్కల రమ్య రాజిరెడ్డి, అకాడమిక్ డీన్ బిఎస్ గోపాలరావు అన్ని బ్రాంచీల ప్రిన్సిపాల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

Tags: