విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
విశ్వంభర, రాంనగర్ : విద్యుత్ ఆర్టిజన్, అసిస్టెంట్ మాన్, పీస్‌రేట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదు అజామాబాద్ విద్యుత్ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్టిసన్ కార్మికులకు విద్యా అర్హతలను పరిగణనలోకి తీసుకుని కన్వర్షన్ చేపట్టాలని, పార్ట్‌టైమ్ కార్మికులకు సర్వీసుకు సంబంధించిన నిబంధనలు వర్తించేలా స్పష్టమైన రూల్స్ అమలు చేయాలని సూచించారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న హక్కులను ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సైదులు గౌడ్, శ్రీరాములు, మధు, రమేష్, లక్ష్మి, ప్రసాద్, బసవరాజు, వెంకటరమణ పాల్గొన్నారు.



