అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి
On
విశ్వంభర, ముషీరాబాదు : అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో టీ సాగర్, పశ్య పద్మ, బి రాము, మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఎన్రెడ్డి హంసారెడ్డి, నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఆలకుంట్ల సాయన్న మాట్లాడుతూ, ఈ ఒప్పందం రైతులకు నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోతినేని సుదర్శన్ రావు, సూర్యనారాయణ, దేవరామ్, కోటేశ్వరరావు, ఇంద్రసేన, తుకారాం నాయక్, సనప పొమ్మయ్య, వి సదానందం తదితరులు పాల్గొన్నారు.



