బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు

ముఖ్య అతిథి గా హాజరైన అభిజ్ఞ భారత సంస్థ ఫౌండర్ నిర్వాహకురాలు డాక్టర్ కావ్య

బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు

విశ్వంభర, హైదరాబాదు: బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం చిక్కడపల్లి శాఖలో  స్వీకార్ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్ అండ్ ఉన్నతి జూనియర్ కాలేజీ ఫర్ ది హీరింగ్ హ్యాండిక్యాప్డ్ , బాలవికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్  స్కూల్స్ నుండి 130 మంది దివ్యాంగులైన పిల్లలకు క్యారమ్స్, చెస్, డ్రాయింగ్, మెహందీ పోటీలను నిర్వహించారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెల్చుకున్నారు. స్వీకార్ స్పెషల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస రావు  అభిజ్ఞ భారత సంస్థ ఫౌండర్ నిర్వాహకురాలు డాక్టర్ కావ్య  ముఖ్య అతిథి గా హాజరై బ్రహ్మా కుమారీస్ యొక్క సేవా కార్యక్రమాలు దివ్యాంగుల  సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు.  పిల్లలకు నైతిక విలువలు, పాజిటివ్ థింకింగ్, కారక్టర్ బిల్డింగ్  తదితర అంశాల గురించి చిక్కడపల్లి శాఖ ఇన్చార్జి జయశ్రీ తెలియచేసారు.
చిక్కడపల్లి బ్రహ్మకుమారి తరపున దివ్యాంగుల కోసం భారత సంస్థ ఫౌండర్ వారికి కొంత నగదును చెక్కు రూపకంగా అందజేశారు.

Tags: