సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ
విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో బాచుపల్లి గ్రామ సర్పంచ్ సబితా యుగందర్ రెడ్డి కత్తుల నరసింహ కి సీఎం రిలీఫ్ పండ్ చెక్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా, నాతన దృష్టికి తీసుకువస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని , ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్స్ సిచ్ కృష్ణ, ఏ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వై రాఘవేందర్, ఎం. శ్రీశైలం, కె వెంటేష్, ఇ శెంకరయ్య, ఏ నవీన్ గౌడ్, పి మహేందర్, కె రాజశేఖర్, ఏ నగేష్, గౌడ్ పి భాస్కర్, ఏ లక్ష్మణ్, కె. శ్రీశైలం, గ్రామ పెద్దలు పి నారాయణ, ఏ రామచంద్రయ్య, డి లక్ష్మయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



