ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయమే..
- హుస్నాబాద్ బిఆర్ఎస్ నేతలు
విశ్వంభర, హుస్నాబాద్: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన ఉద్యమ విజయమని హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దాదాపు 20 రోజుల పాటు విద్యార్థులు ఎలాంటి రాజకీయ పార్టీ జెండా, ఏ నాయకుడి అండ లేకుండానే పోరాటం సాగించారని తెలిపారు. విద్యార్థుల ఐక్యత, పట్టుదల ముందు కేంద్ర ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చిందన్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, పలువురు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఏ ప్రభుత్వం కూడా చెలగాటం ఆడకూడదని, పరీక్షల పేపర్ల లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ ప్రకటనలో బీఆర్ఎస్ నాయకులు సూద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్ రెడ్డి, ఇంద్రాల సారయ్య, యాస శ్రీనివాస్, మేకల వికాస్ యాదవ్, గుగులోతు తిరుపతి నాయక్ పాల్గొన్నారు.