ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

  • రూ. 28.50 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన

విశ్వంభర, పెద్దశంకరంపేట: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. కంగ్టి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ. 28.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సివిల్, ఎలక్ట్రికల్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య మరమ్మతుల అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కళాశాల భవనాల మరమ్మతులు, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల, తాగునీటి వసతి, పారిశుద్ధ్య వ్యవస్థ అభివృద్ధి వంటి పనులు పూర్తయితే విద్యార్థులు మరింత అనుకూలమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసే అవకాశం కలుగుతుందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యాభివృద్ధే సమాజ ప్రగతికి పునాదిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/priority-is-given-to-infrastructure-development-in-government-educational-institutions/article-19702

Tags: