ఇందిరాపార్క్ బీసీ ధర్నాకు సంఘీభావం. 

 - రాపోలు జ్ఞానేశ్వర్ పిలుపు

ఇందిరాపార్క్ బీసీ ధర్నాకు సంఘీభావం. 

విశ్వంభర, హైదరాబాద్ :- గచ్చిబౌలిలో వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అక్టోబర్ 24న జరిగే 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఇందిరా పార్క్ ధర్నాకు మద్దతుగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్ పోస్టర్ను ఆవిష్కరించి, రేపటి ధర్నాలో సంఘీభావంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు ప్రతి బీసీ బిడ్డ కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సాగర్ సంఘం, ఎస్సీ సంఘం నాయకులు బి. నందు, కాలే బసవరాజు, ముదిరాజు సంఘం ఆర్. విజయ్కుమార్, గొల్ల సంఘం యాదగిరి, కూర్మ సంఘం ఆర్. సంతోష్, గౌడ్ సంఘం నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

 

Tags: