కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం : కే ఎల్ ఆర్

కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం : కే ఎల్ ఆర్

  • బిజెపి, బి ఆర్ఎస్  లకు తెలంగాణలో మనుగడ లేదు
  • సిరిగిరిపురం గ్రామం నుంచి భారీగా చేరికలు

విశ్వంభర, తుక్కుగూడ :  తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మనుగడ లేదని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామం నుంచి భారీగా కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేఎల్ఆర్. సామాజిక న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తుందన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని లక్ష్మారెడ్డి చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగు లేని శక్తిగా మారిందని కే ఎల్ ఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీకి నాయకత్వ లేమి ఉందన్నారు. ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని కేఎల్ఆర్ తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని చేరికలు ఉంటాయని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వెంకటేష్ పవన్, సురేష్, హరీష్, పరమేశ్, మల్లేష్, యాదయ్య, శ్రీశైలం రఘుపతి, రాజు, ఇంద్రకంటి నరసింహ, రావుల సోమేష్, గండికోట శ్రీను, వెంకటేశ్, కొమురయ్య పాల్గొన్నారు.

Tags: