ఘనంగా శనీశ్వర్ ఆలయంలో  శని పెయార్చి పండుగ వేడుకలు 

ఘనంగా శనీశ్వర్ ఆలయంలో  శని పెయార్చి పండుగ వేడుకలు 

విశ్వంభర, పాండిచ్చేరి :- శని పెయార్చి పండుగ  తిరునల్లార్‌లోని  అంగరంగ వైభవంగా జరిగింది. సాధారణంగా, శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిచక్రాన్ని మారుస్తాడు. కొన్నిసార్లు అతను కొన్ని రాశిచక్రాలలో 3 సంవత్సరాలు గడుపుతాడు. కానీ శనిదేవుడు 12 రాశిచక్రాల గుండా ప్రయాణించడానికి 30 సంవత్సరాల వరకు పడుతుంది.ఎంతో విశిష్టత కలిగిన  ఈ యొక్క వేడుకలను తిలకించడానికి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుండి , విదేశాల నుండి శనీశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి చాల మహిమ గల ఆలయం గా పేరు గాంచింది. ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి ఎలాంటి సమస్యలు ఉన్న తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమానికి సోలిన్ హాస్పిటల్ అధినేత నందనంపాటి రామాంజనేయులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. వేలమందికి అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

 

Tags: