జులై 11వరకు.  జిల్లా వ్యాప్తంగా నాగన్న సంతాప సభలు నిర్వహించాలి 

  • సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ  జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య పిలుపు 

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : ఈనెల 11వ తేదీన జిల్లా వ్యాప్తంగా  నాగన్న సంతాప సభలు నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శి  గౌని ఐలయ్య  పిలుపుని చారు . ఈ సందర్భంగా ఆదివారం  జిల్లా కేంద్రంలోని  పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సంతాప సభలో   నాగన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా సంతాప సభని ఉద్దేశించి గౌని ఐలయ్య మాట్లాడుతూ,  ఎమర్జెన్సీ చీకట్లను చీల్చుకుంటూ  సైరన్ మోతై ప్రజలను మేల్కొల్పుతూ ప్రారంభమైన నాగన్న పాట నేడు ఆగిపోయిందని, ఎమర్జెన్సీ కాలంలో రాజ్యం బూటకపు ఎన్కౌంటర్ కు బలైన శ్రీపాద శ్రీహరి ,  జన్మస్థలమైన రాజారం , లో పుట్టిన నాగన్న ఆయన వారసత్వాన్ని స్వీకరించి ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే కంజర పట్టుకొని, కాలుకు గజ్జ కట్టుకొని ఉద్యమ గానమై ఊరూరు తిరిగిన నాగన్న పాట ప్రజలను దోపిడీ అణచివేతలపై తిరుగుబాటుకు పురిగొల్పిందని  గౌని ఐలయ్య గుర్తు చేశారు . అంతేకాకుండా  నాగన్న 50 ఏళ్ల తన విప్లవ సాంస్కృతిక ప్రస్థానంలో నాగన్న ఉన్నత శిఖరాలను అందుకున్నాడని, నేడు నాగన్న అనే పేరు ఉద్యమ పాటకు మారుపేరుగా నిలిచిందదని వారు  అన్నారు . నాగన్న ప్రాణం కోల్పోయినా ఆయన పాట శాశ్వతంగా మనమధ్య నిలిచి వుంటుందని అన్నారు. కమ్యూనిస్టు కవులకు కళాకారులకు నాగన్న ఆదర్శ ప్రాయుడని కొనియాడారు . ఈనెల 11  వ తేదీ వరకు జిల్లాలో గ్రామ ,  గ్రామాన నాగన్న సంతాపసభలు జరపాలని పిలుపునిచ్చారు . ఈ సభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఇడంపాక శ్రీశైలం ,  ప్రసంగిస్తూ నాగన్న ఉక్కు క్రమశిక్షణ కలిగిన నిస్వార్థ ప్రజా కళాకారుడని, ప్రభుత్వ పథకాలను, పాలకుల ప్రలోభాలను తిరస్కరించి నికార్సయిన సాంస్కృతిక యోధుడిగా నిలిచాడని అన్నారు . అరుణోదయ ఆవిర్భావం నుండి తుది శ్వాస దాకా విప్లవ కళా రంగ సైనికుడిగా 5 దశాబ్దాల పాటు విశేష కృషి చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ, ప్రజా సంఘాల నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, నాయకులు బట్టు చైతన్య ,  మోకాళ్ళ మురళీకృష్ణ,జడ సత్యనారాయణ,మైల యాకన్న, ఊడుగుల లింగయ్య,చిర్ర యాకన్న, గజ్జి లింగన్న,యస్కే బాబు, బట్టు చైతన్య,బోనగిరి మధు, చింతా వెంకన్న తదితరులు పాల్గొన్నారు .

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/naganna-condolence-meetings-should-be-held-across-the-district-till/article-18001

Tags: