వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి: పట్టణంలోని 500 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..పరిగి ప్రజల చిరకాల కోరిక శ్రీ వేణుగోపాల స్వామిదేవాలయపునర్నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపడతామని తెలిపారు.ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి,శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను ఆలయంలో వైభవంగా నిర్వహించేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ ఆలయం పరిగి ప్రాంతానికి ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రజల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు, మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్, కౌన్సిలర్ బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజ పుల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రాములు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్, హైమద్, తదితరులు పాల్గొన్నారు.