హామీలు అమలులో కాంగ్రెస్ విఫలం 

హామీలు అమలులో కాంగ్రెస్ విఫలం 

  • ఎంపీ ఈటల రాజేందర్

విశ్వంభర, మల్కాజిగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ప్రజల కష్టాల్లో తాను ఎప్పుడూ అండగా ఉంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోతారంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విస్తృతంగా ప్రచారం చేశారు. 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రియాంక శ్రీకాంత్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల పనులు చేయించేవారే నిజమైన నాయకులని పేర్కొన్నారు.  మాజీ మంత్రి కృష్ణ యాదవ్  మాట్లాడుతూ,  తెలంగాణకు ఈటల రాజేందర్ నాయకత్వం అవసరమని అన్నారు. ఢిల్లీలో మోదీ, ఇక్కడ ఈటల ఉన్నారని పేర్కొంటూ కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భుద్ది శ్రీనివాస్, నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, నవజీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: