జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలి
- అదనపు న్యాయ మూర్తి
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి , సీనియర్ సివిల్ జడ్జ్ ల మార్గదర్శకాల ప్రకారం ప్రతి కోర్టు పరిధిలో విడివిడిగా జాతీయ లోక్ అదాలత్ సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్న ఉత్తర్వుల ప్రకారం మంగళవారం అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అర్వపల్లి కృష్ణతేజ పోలీస్ ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ నిన్నటి నుండే ముందస్తు లోక్ అదాలత్ ప్రక్రియ ప్రారంభమైందని ఈ నెల 20 తేదీ వరకు ఈ అవకాశాన్ని కాక్షిదారులు వినియోగించుకోవాలని అందుకోసం పోలీస్ శాఖ సహకరించాలని కోరారు.పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న పాత కేసులు, వాహనాల చలానాలు, చిన్నపాటి గొడవలకు సంబంధించిన కేసులను గుర్తించి, ఇరు వర్గాల వారికి సమాచారం అందచేసి ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ పడేలా కృషి చేయాలన్నారు.ఈ సమావేశం లో అదనపు జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్ట్ పరిధిలోని ఆన్నీ పోలీస్ స్టేషన్ ల సీఐ లు, ఎసై లు, అబ్కారీ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.